అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా

బీజింగ్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనపై చైనా స్పందించింది. కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సంక్షోభ సమయంలో అగ్రరాజ్యం నిర్ణయం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొంది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అమెరికా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా అధికారి జావో లిజియన్‌ మాట్లాడుతూ.. ‘‘ అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ సామర్థ్యాలను బలహీనపరిచేలా ఉంది. మహమ్మారిపై పోరులో అంతర్జాతీయంగా పరస్పర సహకారం అందించుకొనే అంశానికి విఘాతం కలిగించేలా ఉంది’’అని పేర్కొన్నారు.(కరోనా: డబ్ల్యూహెచ్‌ఓకు షాకిచ్చిన ట్రంప్‌!)