నర్సీపట్నం: కరోనా వైరస్ ప్రభావం కారణంగా..ఇందిరా మార్కెట్‌లో దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యాపారులు సహకరించాలని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి, ఏఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి కోరా రు. ఇందిరా మార్కెట్ ప్రస్తుత పరిస్థితుల్లో అ నువు కానందున వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల మైదానం, పెదబొడ్డేపల్లి రైతుబజార్, బలిఘట్టం సచివాలయం ఆవరణల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు మార్కింగ్ ఇస్తామని వ్యాపారులకు ఏఎస్పీ బుధవారం సూచించారు. అయితే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్‌కు తాము వెళ్లలేమని వ్యాపారు లు చెప్పడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. మీ వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టవద్దని ఏఎస్పీ కోరారు. వ్యాపారంకంటే ప్రాణాలు ముఖ్యమని వ్యాపా రులకు ఆర్డీవో, ఏఎస్పీ రెండు గంటలకు పైగా నచ్చచెప్పారు. అప్పటికీ వ్యాపారులు వినకపోవడంతో ఆగ్రహంవ్యక్తంచేశారు. తక్షణమే మార్కెట్‌ను బంద్ చేసి, ఆయా ప్రాంతాలకు దుకాణాలను తరలించాలని ఏఎస్పీ సీఐ స్వామినాయుడికి సూచించారు. ఆర్డీవో, ఏఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, తహసీల్దార్ ఎం.ఎ.శ్రీనివాస్, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ రమణబాబు తదితరులున్నారు.
వ్యాపారం కంటే...ప్రాణాలు ముఖ్యం