చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి








చిత్తూరు : జిల్లాలోని కెవి. పల్లి మండలం మహల్‌ క్రాస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నకారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రగాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సిఉంది.